Breaking News

రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్ కుట్ర‌

Published on Tue, 07/02/2024 - 12:14

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్  ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖ‌లు చేసిన చార్జ్‌షీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.  స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు క‌రుడుగట్టిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర బ‌య‌ట‌ప‌డింది.  

కాగా గ‌త ఏప్రిల్‌ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు  ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్‌ థాపన్‌ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు.  రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసిన‌ట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.

సల్మాన్‌ హత్య కుట్రలో భాగంగా సల్మాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే  గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.

నిందిత మైనర్‌లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి ప‌నిచేస్తున్న‌ట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)