Breaking News

అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

Published on Mon, 02/02/2026 - 13:15

సాక్షి, ముంబై: దేశీయంగా వెండి, బంగారం రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో తక్కువ రేటు ఉన్నపుడు కొనలేకపోయాయే అన్న బెంగ ఒకవైపు,  మరోవైపు  కాస్త ధరలు తగ్గగానే భారీ లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొంతమంది పెట్టుబడి దారులు పసిడి వెంట పరుగులు పెడు తున్నారు. ఇది దురాశే అవుతుందని, చాలామంది రిటైల్‌ పెట్టుబడుదారులు భారీగా నష్టపోతున్నారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఆర్థిక సలహాదారు ఆదిత్య షా ఇటీవల ఎక్స్‌లో చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీసింది. ధర పెరుగు తుందన్న అంచనాలతో తన ఫాలోయర్‌ ఒకరు నష్టాన్ని మూటగట్టుకున్న వైనాన్ని ఆయన వివరించారు. ఆర్థిక అవగాహన  ప్రాముఖ్యతపై ఆన్‌లైన్‌లో తీవ్రమైన చర్చకు దారితీసింది.

షా తన పోస్ట్‌లో వివరించిన దాని ప్రకారం  ఒక్క నెలలో 10-12 శాతం  లాభాలొస్తాయన్న అంచనాతో అతను ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి కొనుగోలు చేశాడు. అదీ  క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి. కట్‌ చేస్తే.. ధరలు మరింత  భారీగా క్షీణించాయి. దీంతో అతను చిక్కుల్లో పడిపోయాడు. ధరలు పడిపోవడం వల్ల ఒక నష్టమైతే, గడువు లోపు క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ కట్టాల్సి రావడం మరో కష్టం. మార్కెట్‌పై అవగాహన, నియంత్రణలేని దురాశకు ఇది మచ్చుతునక అని  షా అభివర్ణించారు.

నెటిజనుల చర్చ
చాలామంది మధ్యతరగతి పెట్టుబడిదారులు బంగారాన్ని ఈక్విటీ స్టాక్ లాగా చూస్తున్నారని, బంగారం సాంప్రదాయకంగా స్వల్పకాలిక వాణిజ్య సాధనంగా కాకుండా దీర్ఘకాలిక హెడ్జ్‌గా ఉన్నప్పటికీ, లాభాలు సాధించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తున్నారని ఒకరు పేర్కొన్నారు.ఇక్కడ సాధారణ మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో కూడా తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.

నష్టాలు తొందరగా వస్తాయి.. లాభాలు చాలా అలస్యంగా వస్తాయి. అందుకే సామాన్య ట్రేడర్లు ఆచితూచి అడుగువేయాలని మరికొందరు భావించారు. లివరేజ్‌ను ఉపయోగించినట్లయితే, అనుభవం, ప్రణాళిక, తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాల ప్రాప్యత లాంటివి అవసరమని చాలామంది నొక్కి చెప్పారు. ఇలాంటి ట్రేడింగ్స్‌లో స్పష్టమైన నిష్క్రమణ వ్యూహం లేదా రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ లేకుండా  దాదాపు విఫలమయ్యే అవకాశం ఉందని వారు వాదించారు.

లాంగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ , రిస్క్‌ మేనేజ్‌మంట్‌ ప్లాన్‌ 
వెండి, బంగారం, ఇతర విలువైన మెటల్స్‌ ధరలు డాలరు, రూపాయి మారకం, అంతర్జాతీయ పరిస్థితులతో అనేక అంశాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దేశంలో బంగారం, వెండి ఎంత స్థాయిలో పెరిగాయో అదే స్థాయిలో అస్థిరతలు కొనసాగుతున్నాయి.   బంగారం, వెండి లాంటి వాటిపై  పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉండాలనీ తెలిపారు. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉన్నపుడు  నిపుణుల సలహాలను గమనించాలని, గోల్డ్‌ పెట్టుబడుల్లో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ పండితులు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు