Breaking News

Hit And Run Case: రూ. 1.98 కోట్ల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశం

Published on Wed, 07/17/2024 - 14:25

న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీని ట్రిబ్యూనల్‌ ఆదేశించింది. రూ.1.21 కోట్ల‌ను ప‌రిహారంగా, 77.61 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు  30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.

వివరాలు  2016 ఏప్రిల్‌ 4న ఢిల్లీలో హిట్‌ అండ్‌ రన్‌  ఘటన జరిగింది.  సివిల్స్‌ లైన్‌ ప్రాంతంలో ఓ మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్‌ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్‌ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్‌ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్‌ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ ట్రిబ్యూనల్‌ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్ల‌ను ప‌రిహారంగా, 77.61 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను  30 రోజుల్లోగా ఇవ్వాల‌ని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. 

అంతేగాక కారు రిజిస్ట్రేషన్‌ చేసిన మైనర్‌ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది.  మైన‌ర్ కుమారుడిని మెర్సిడెస్‌ కారు నడుపడం అడ్డుకోవ‌డంలో తండ్రి విఫ‌ల‌మైన‌ట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యున‌ల్ పేర్కొం‌ది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)