Breaking News

రూ. 5తో ‘రోల్స్ రాయిస్’ క్వాలిటీ చెక్‌!

Published on Thu, 08/22/2024 - 12:29

రోల్స్ రాయిస్... అత్యంత ఖరీదైన ఈ కారును కొనుగోలు చేయాలని కొందరు కోటీశ్వరులు తహతహలాడుతుంటారు. అలాగే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రతీ కారును సంబంధిత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఒక్కో రోల్స్‌ రాయిస్‌ కారు తయారీకి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.

దీనికిగల కారణం.. రోల్స్ రాయిస్‌ కారులోని కొన్ని భాగాలకు చేతితో పెయింటింగ్‌ చేసి, వాటిని అసెంబుల్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నకారణంగానే ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. అయితే రోల్స్ రాయిస్ కారు క్వాలిటీని కేవలం ఐదు రూపాయల నాణెంతో చెక్‌ చేయవచ్చంటున్నారు ప్రముఖ యూట్యూబర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు పీ ఆర్‌ సుందర్. ఈ కారుకు సంబంధించిన  ఆసక్తికరమైన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.

రోల్స్ రాయిస్ చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, వీటి గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కారు ఇంజన్‌ ఆన్‌లో ఉన్నప్పుడు దానిపై ఐదు రూపాయల నాణెం  ఉంచితే.. అది  కదలి, ​కిందికు పడిపోదన్నారు. రోల్స్ రాయిస్ ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా దానిలో వైబ్రేషన్ రాదని సుందర్‌ తెలిపారు.

రోల్స్ రాయిస్‌ కారును భారత్‌కు తీసుకురావాలంటే అధిక మొత్తంలో దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుందని  అన్నారు. భారతదేశంలో ఈ కారును నడపాలనుకుంటే, కారు కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  దుబాయ్‌లోని తన రోల్స్ రాయిస్‌ను భారత్‌కు తీసుకురావడానికి వీసా, పాస్‌పోర్ట్‌ పొందానని తెలిపారు. ఆరు నెలల తర్వాత తన కారును తిరిగి దుబాయ్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుందని సుందర్‌ పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)