Breaking News

దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి: రోహిణి ఆచార్య ఫైర్‌

Published on Wed, 11/19/2025 - 07:29

పట్నా: ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల ప్రేమతో తన కిడ్నీ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు.

కిడ్నీలు విఫలమై ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లకు కిడ్నీని దానం ఇచ్చాకే నాపై విమర్శలు చేయాలని విమర్శలు చేసే వాళ్లకు ఆమె దీటైన సవాల్‌ విసిరారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘లాలూపై మొసలి కన్నీరు కార్చేవాళ్లు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి ఒక కిడ్నీ దానంచేసి రావాలి. అప్పుడు నాది మురికి కిడ్నీ యా కాదా అనే చర్చకు కూర్చోవాలి. తండ్రికి దానమిచ్చిన కూతురి కిడ్నీని మురికిది అంటూ హేయమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్లు తొలుత కిడ్నీ ఇచ్చి లాలూ పట్ల తమ నిజమైన విధేయతను చాటుకోవాలి. హరియాణా మహాపురుషుడు, మద మెక్కిన పాత్రికేయులు ముందు కిడ్నీ ఇవ్వాలి’’ అని అన్నారు.

తేజస్వీ యాదవ్‌ సన్నిహిత నేత రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌నుద్దేశిస్తూ హరియాణా మహా పురుషుడు అని రోహిణి వ్యాఖ్యానించారు. ‘‘ఒక బాటిల్‌ రక్తం దానం చేస్తే శరీరం కృషించిపోయే వాళ్లు కూడా కిడ్నీ దానంపై ప్రసంగాలిస్తారా?’’అని రోహిణి ఆగ్రహం వ్యక్తంచేసింది. మురికి కిడ్నీ ఇచ్చావంటూ సొంత కుటుంబ సభ్యులు(తేజస్వీ యాదవ్‌) ఇంట్లోంచి తరిమేశారని, వాళ్లతో బంధం తెంచుకున్నానని రోహిణి ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. తన సోదరిని అవమానించిన వాళ్ల అంతు చూస్తానని లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)