Breaking News

ప్రియుడిపై పగ.. పోలీసులతో ఐటీ ఉద్యోగిని ఆటలు

Published on Fri, 11/07/2025 - 08:12

సాక్షి, బనశంకరి: ప్రేమ విఫలం కావడంతో ప్రియుడి పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రేమ విఫలమైన బాధ ఆమెను వెంటాడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడింది. విమానాశ్రయాలు, బడులు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలను తరుచూ బెదిరిస్తున్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలను సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌సింగ్‌ మీడియాకు వెల్లడించారు. రెని జోషిల్డా బెంగళూరులో రోబోటిక్స్‌ ఇంజినీర్‌గా పనిచేసేది. సహోద్యోగితో ప్రేమ విఫలం కావడం.. అతను మరో యువతిని పెళ్లాడాడు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ప్రియుడి పేరుతో నకిలీ ఈ–మెయిల్స్, వాట్సాప్‌ అకౌంట్లు సృష్టించి.. వాటి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు పంపించేది.

అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ క్రికెట్‌ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు గతంలో హెచ్చరించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తన ప్రియుడు కారణమంటూ ఈ–మెయిల్‌ పంపింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ప్లాన్‌. ఇలా జూన్‌ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్‌ వివరించారు. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన గుజరాత్‌ పోలీసులు.. విచారణ జరిపి రెని జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అహ్మదాబాద్‌ జైలు నుంచి వారెంట్‌పై బెంగళూరుకు తెస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)