Breaking News

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Published on Sat, 02/15/2025 - 09:15

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్‌ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. మీర్జాపుర్‌-ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. 

ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

 

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)