Breaking News

ఆర్జేడీలో ట్విస్ట్‌.. రమీజ్‌ ఎవరంటే?

Published on Sun, 11/16/2025 - 08:01

పాట్నా: బిహార్‌లో ఆర్జేడీ ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కుమార్తె రోహిణి ఆచార్య.. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ సందర్బంగా ‘నేను రాజకీయాలను వదిలేస్తున్నా. నా కుటుంబానికి దూరంగా జరుగుతున్నా. ఈ పని చేయాలని నాకు సంజయ్‌ యాదవ్, రమీజ్‌ సూచించారు. నిందలన్నీ నేనే భరిస్తా’ అని శనివారం ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.

రమీజ్‌ ఎవరు? 
ఈ నేపథ్యంలో సంజయ్‌ యాదవ్‌, రమీజ్‌పై కొత్త చర్చ మొదలైంది. కాగా, రమీజ్‌ ఆలం ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన వ్యక్తి. జార్ఖండ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని గురించి రాజకీయ వర్గాలలో చాలా తక్కువగా తెలుసు. తేజస్వీ యాదవ్‌, సంజయ్ యాదవ్‌కు రమీజ్ సన్నిహితుడు. అయితే, రమీజ్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్‌ అనే మార్క్‌ అతడిపై ఉంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. అతని మామ ఉత్తరప్రదేశ్‌లోని అగ్ర నేరస్థుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. రమీజ్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. అయితే వారిద్దరూ రోహిణికి ఏం సూచించారనేది స్పష్టంగా తెలియడం లేదు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

తేజ్‌ ప్రతాప్‌ ఎఫెక్ట్‌.. 
వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.  ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్‌ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ చేతిలో ఓడారు.

ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్‌ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్‌ అతి జోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్‌ అధికార్‌ యాత్రలోనూ సంజయ్‌ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, మరో సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)