Breaking News

లాలు ఫ్యామిలీకి భారీ షాక్‌!

Published on Mon, 10/13/2025 - 11:53

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్, ఆయన భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. 

వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 ‘టెండర్‌ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్‌ యాదవ్‌కు తెలిసే జరిగింది. టెండర్‌ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్‌ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్‌ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. 

ఏంటీ కుంభకోణం?
2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు బీఎన్‌ఆర్‌ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్‌’అనే ప్రైవేట్‌ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్‌ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.  2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 
 

మరోవైపు.. బీహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)