Breaking News

పెద్దల అనుభవంతో విద్యార్థులకు లబ్ధి 

Published on Mon, 07/28/2025 - 06:39

శ్రీనగర్‌:  యూనివర్సిటీ ఆఫ్‌ కాశ్మీర్‌ నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు రావాలని, దేశ అభివృద్ధికి, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి వారు పాటుపడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆకాంక్షించారు. ఆయన ఆదివారం శ్రీనగర్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ కాశ్మీర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించారు. 

పూర్వ విద్యార్థుల అనుభవం, పరిజ్ఞానం నేటి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పెద్దలు చొరవ తీసుకుంటే నేటి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా సేవలందించాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువతకు మెరుగైన భవిష్యత్తు అందించడానికి రోడ్‌మ్యాప్‌ రూపొందించాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాశ్మీర్‌ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను దేశానికి అందిస్తున్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు.

 కాశ్మీర్‌ నిజంగా భూమిపై స్వర్గమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఇది ఎంతో అందమైన ప్రాంతమని పేర్కొన్నారు. మనం స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. యూనివర్సిటీ పూర్వ విద్యారి్థ, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను జస్టిస్‌ గవాయ్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)