Breaking News

Jammu Kashmir: ఉగ్రవాదులను తరిమికొడుతున్న గ్రామీణులు

Published on Sun, 08/25/2024 - 09:21

జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉగ్రవాదులను తరిమికొట్టే పనిలో పడ్డారు.

జమ్ముకశ్మీర్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు విలేజ్ సెక్యూరిటీ గ్రూప్ (వీడీజీ) సభ్యులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు ఆధునిక ఆయుధాలు అందజేస్తున్నారు. గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఎస్‌ఎల్‌ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లను పోలీసులు ఇస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించినపక్షంలో వారికి గ్రామస్తులు ధీటుగా సమాధానం ఇ‍స్తున్నారు. గత కొన్ని రోజులుగా వీడీజీ సభ్యులతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి వారికి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లను అందజేస్తున్నారు.

ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధమయ్యేలా గ్రామస్తుల్లో ధైర్యం, మనోధైర్యాన్ని వీడీజీ సభ్యులు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ధార్ సక్రికి చెందిన చైన్ సింగ్, జస్వంత్ సింగ్, గబ్బర్, రొమేష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ గ్రామాల్లోని పలువురిని చంపేశారన్నారు. ఆ తర్వాత గ్రామ భద్రతా కమిటీలు తమకు త్రీ నాట్ త్రీ రైఫిల్స్‌ అందజేశాయన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)