Breaking News

డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్‌ సర్కార్‌

Published on Sat, 10/12/2024 - 19:06

కోల్‌కతా ఆర్టీ కర్‌ హాస్పిటల్‌ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్‌ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్‌ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా  ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం స్పందించింది.

ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్‌ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.

 

జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో  ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)