Breaking News

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీ

Published on Tue, 09/03/2024 - 17:25

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్‌ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార కేసులో సందీప్‌ ఘోష్‌ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇ‍వ్వాలని సీబీఐ కోల్‌కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒ​క నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్‌ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్‌ ఘోష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్‌ చేసింది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)