Breaking News

ఆర్జీకర్‌ కేసులో కీలక మలుపు

Published on Fri, 01/31/2025 - 11:16

కోల్‌కతా ఆర్జీకర్‌ హత్యాచార కేసులో న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో దోషి సంజయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడికి ఈ శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలనే అభ్యర్థన ఉన్నతన్యాయస్థానం ఎదుటకు చేరింది. అయితే సంజయ్‌కు ఉరిశిక్ష పడడం తమకు ముఖ్యం కాదని, ఈ నేరంలో భాగమైన వాళ్లందరి పేర్లు బయటకు రావాలని అభయ(బాధితురాలి) తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

అభయ తల్లిదండ్రులు గురువారం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. తమ ఆవేదనను(ఫిర్యాదును) రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆయన.. అవసరమైతే వాళ్ల అప్పాయింట్‌మెంట్‌ ఇప్పించే ప్రయత్నం చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ సైతం అభయం తల్లిదండ్రుల్ని కలిసి.. వాళ్ల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు.

అభ్యంతరాలు దేనికి?..
ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరుపై అభయ తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ కేసులో ఆధారాలను కోల్‌కతా పోలీసులు నాశనం చేశారని ఆరోపించారు. ఇటు.. సీబీఐ జరిపిన దర్యాప్తుపైనా తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. ఈ నేరంలో సంజయ్‌ ఒక్కడే భాగం కాదని, ఇంకా బయటకు రావాల్సిన పేర్లు  ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. కోల్‌కతా పోలీసులు ఆస్పత్రి నిర్వాహకులతో కలిసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు.  కేసు విచారణలో భాగంగా.. తొలి ఐదురోజులు దర్యాప్తు జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని అంటున్నారు.

సుప్రీంలో పిటిషన్‌ వెనక్కి
ఆర్జీకర్‌ కేసులో మళ్లీ విచారణ జరిపించాలని అభయ తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ చేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను వాళ్లు వెనక్కి తీసుకున్నారు. 

కిందటి ఏడాది ఆగష్టులో సుప్రీం కోర్టు ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణలో తమను భాగం చేయాలని Intervention Application ద్వారా అభయ తల్లిదండ్రులు అభ్యర్థించారు. కానీ, ఈ కేసులో సంజయ్‌కు శిక్షపడక ముందే కలకత్తా హైకోర్టులో ‘ఫ్రెష్‌ విచారణ’ కోరుతూ ఓ పిటిషన్‌ వేశారు. ఇప్పుడు  ఈ విషయం తమ పరిశీలనలో గుర్తించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్‌ తరఫు మహిళా న్యాయవాదిని హెచ్చరించింది. సత్వరమే పిటిషన్‌ వెనక్కి తీసుకుని.. కావాలనుకుంటే కొత్తగా పిటిషన్‌ వేయాలని సూచించింది. దీంతో.. అభయ తల్లిదండ్రులు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఇక ఆర్జీకర్‌ కేసులో.. సంజయ్‌ రాయ్‌కు మరణశిక్ష విధించాలంటూ బెంగాల్‌ ప్రభుత్వం, సీబీఐలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అయితే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ల విచారణకు స్వీకరించే అంశంపై విచారణ జరిపి.. తీర్పును కలకత్తా హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)