Breaking News

తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..

Published on Tue, 02/25/2025 - 14:00

ఈ రోజుల్లో అందరూ ఫోనుకు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా యువత ఫోను(Mobile Phone)తో టైమ్‌పాస్‌ చేస్తూ చదువులను కూడా పక్కనపెడుతున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం రీవాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రస్తుతం జరుగుతున్న సీబీఎస్‌సీ పదవ తరగతి పరీక్షలకు హాజరవుతోంది. అయితే పుస్తకం చదువుతున్నానని(studying) తల్లికి చెప్పి, ఫోనులో సోషల్‌ మీడియా పోస్టులను చూస్తోంది. దీనిని గమనించిన తల్లి.. కుమార్తె దగ్గనున్న ఫోనును లాక్కుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ పదవ తరగతి విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏకంగా 13 కిలోమీటర్ల దూరం నడచి వెళ్లి,అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్‌ చేసింది.

ఆ స్నేహితురాలితో పాటు కలసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న ఒక రైలులో కూర్చుంది. అయితే రైలు టీటీఈ ఆ విద్యార్థినులను ఖాండ్వా రైల్వే స్టేషన్‌(Railway station)లో ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. వారు తడబడుతూ మాట్లాడుతుండటంతో టీటీఈ వారిని ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు మైనర్‌లని తేలింది. దీంతోవారిని ఆర్‌పీఎఫ్‌ పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అక్కడి సిబ్బందికి ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామా చెప్పడంతో వారు ఆ విద్యార్థినులను తీసుకుని స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌ శర్మ మాట్లాడుతూ వారిలో ఒక విద్యార్థిని వయసు 15 అని, మరొకరి వయసు 17 అని తెలిపారు. వారిద్దరూ ఒకే స్కూలులో చదువుతున్నారని, వారిద్దరికీ నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాక వారిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.  

ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)