Breaking News

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

Published on Mon, 06/22/2026 - 06:04

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం రాత్రి ముంబై మీదుగా హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి కేంద్ర మంత్రులతో కీలక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌–2 విస్తరణ, పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో నేరుగా తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మెట్రో రైలు పెండింగ్‌ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రేవంత్‌ ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.

‘ఈ నెల 22, 23 తేదీల్లో నేను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాను. మీరు చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి’అని రేవంత్‌ లేఖలో కోరారు. అలాగే, రాయదుర్గంలో ఎస్‌బీఐ భూమి వేలం వివాదానికి సంబంధించి రేవంత్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్‌బీఐ చైర్మన్‌పై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.  ప్రభుత్వపరమైన పనులతోపాటు, రాష్ట్ర రాజకీయాలపైనా సీఎం దృష్టి సారించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీలను కలవనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)