భరణం పిటిషన్‌ను 6 నెలల్లో పరిష్కరించండి

Published on Fri, 07/03/2026 - 03:59

సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల వయసున్న ఆటిజం బాధిత చిన్నారిని భర్త, అత్తమామల వద్ద వదిలేసి వెళ్లిన భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను 6నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు విజయవాడలోని ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గుండు సాయికార్తీక్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది బి.శ్రవణ్‌శంకర్‌ వాదనలు వినిపిస్తూ.. సాయికార్తీక్‌ భార్య నాలుగేళ్ల ఆటిస్టిక్‌ చిన్నా­రిని భర్త, అతడి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లి­పోయినట్లు చెప్పారు. 

ఆమె కూడా భర్తతో సమానంగా చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అని, పెళ్లికి ముందు బ్యాంకులో పనిచేశారని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్త చేతికి వచ్చే నికర నెలవారీ ఆదాయం కేవలం రూ.48 వేలు మాత్రమేనని చెప్పారు. 2024లో భరణం కోసం పిటిషన్‌ వేసిన ఆమె ఇప్పటివరకు కనీసం బిడ్డ కస్టడీ కోరలేదని తెలిపారు. ఈ  పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇది కేవలం కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వ్యవహారమేనని, ప్రస్తుత దశలో ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయి­తే, విజయవాడలోని ట్రయల్‌ కోర్టులో విచారణలో ఉన్న మెయింటెనెన్స్‌ పిటిషన్‌ను 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.  

అసలేం జరిగిందంటే..   
ఐర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుండు సాయికార్తీక్‌పై అతడి భార్య హిమబిందు విజయవాడలోని ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. ఆమెకు నెలకు రూ.50 వేలు మధ్యంతర భరణం చెల్లించాలని 2025 నవంబర్‌ 26న ఆదేశించింది. తనకున్న ఆర్థికభారాన్ని, వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు ఎక్కువ మొత్తాన్ని భరణంగా ఖరారు చేసిందంటూ సాయికార్తీక్‌ ఏపీ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఏపీ హైకోర్టు విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాన కేసును వేగంగా పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశిస్తూ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టేశారు. దీంతో సాయికార్తీక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)