Breaking News

నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!

Published on Thu, 03/05/2026 - 01:14

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: మహిళల్లో నిద్రలేమి అనేది ఒక క్లిష్టమైన ప్రజారోగ్య సమస్యగా అవతరించింది. పురుషుల కంటే మహిళలే నిద్ర విషయంలో అధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో అసమానత ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు. ఫలితంగా నేటి కాలంలో చాలామంది భారతీయ మహిళలకు నాణ్యమైన నిద్ర అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. 

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్‌ డివైసెస్‌ తయారీలో ఉన్న రెస్‌మెడ్‌ ఇటీవల గ్లోబల్‌ స్లీప్‌ సర్వే–2026 నిర్వహించింది. భారత్‌తోపాటు అమెరికా, చైనా, యూకే, జ ర్మనీ, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలండ్, సింగపూర్, మెక్సికో దేశాలకు చెందిన 30 వేల మంది పాలుపంచుకున్నారు. ఇందులో భారత్‌ నుంచి 5 వేల మంది ఉన్నారు. 

ఈ సర్వే ప్రకారం.. నిద్రలేమి సమస్యతో 38% మంది భారతీయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 29% మాత్రమే. వంట, ఇంటి పనులు; పిల్లలు, పెద్దల సంరక్షణ.. భారతీయ మహిళల భు జాలపై సహజంగా ఉండే భారం. ఇంటి నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి దీనికి అదనం. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అటు వృత్తి బాధ్యతలనూ మోయాల్సి వస్తోంది.  

భిన్నమైన ప్రభావం..: సామాజిక, మానసిక ఒత్తిళ్లు స్త్రీ పురుషులపై రాత్రి నిద్ర విషయంలో ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిద్రాభంగం కావడానికి మానసిక ఒత్తిడి, ఆందోళనను ప్రధాన కారకాలుగా 42% మంది మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషుల సంఖ్య 36% ఉంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని 39% మంది మహిళలు, 33% మంది పురుషులు చెబుతున్నారు. 

సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్థిర, నాణ్యమైన నిద్ర అవసరమని ప్రపంచవ్యాప్తంగా 90% మంది గుర్తించారు. ఆహారం, వ్యాయామంతోపాటు నిద్రను అత్యంత ముఖ్యమైన అలవాటుగా 44% మంది భారతీయులు పరిగణిస్తున్నారు. అయినప్పటికీ 53% ప్రజలు వారానికి నాలుగు రాత్రులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే నాణ్యమైన నిద్రను పొందుతున్నట్లు తెలిపారు. ఇది అవగాహనకు, వాస్తవానికి మధ్య పెరుగుతున్న భారీ అంతరాన్ని నొక్కి చెబుతోంది. 

వేరబుల్‌ టెక్నాలజీతో.. 
నిద్ర ప్రాముఖ్యతపై ప్రజల్లో అధిక అవగాహన ఉన్నప్పటికీ సమస్యలున్నవారు వైద్యపరంగా సాయం తీసుకోవడం లేదు. 78% మంది భారతీయులు నిద్ర సమస్యల పరిష్కారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సాధారణ చెకప్‌లలో 69% మందికి మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆసుపత్రులు మరింత చురుకుగా నిద్ర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. 

75% మంది భారతీయులకు తమ నిద్ర విధానాలను మరింత నిశితంగా గమనించడానికి స్మార్ట్‌వాచెస్, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ వంటి వేరబుల్‌ టెక్నాలజీ దోహదపడుతోంది. ఈ పరికరాలు నెగిటివ్‌ ఫలితాలు చూపితే.. 66% మంది వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్య సలహాను పొందుతామని చెబుతున్నారు. 

మానసిక ఆరోగ్యంపై.. 
నాణ్యమైన నిద్ర తక్కువగా ఉండటం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా అంతకుమించిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన నిద్రలేని రాత్రి తర్వాత తాము మరింత చిరాకుగా, ఒత్తిడితో లేదా నిరాశతో ఉన్నట్లు అత్యధికులు తెలిపారు. ప్రత్యేకించి 30% మంది నిద్రలేమికి, కుంగుబాటు లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)