ఢిల్లీలో రెసిడెంట్‌ డాక్టర్‌పై దాడి

Published on Mon, 08/26/2024 - 09:38

ఢిల్లీ: కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్‌ డాక్టర్లకు 11 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవల విరమించారు. సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్‌ డాక్టర్‌, మెడికల్‌ డ్రెస్సర్‌పై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని కర్కర్‌దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్‌లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. 

బాధిత డాక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శనివారం అర్ధరాత్రి 1 గంటలకు తలపై గాయంతో ఓ  వ్యక్తి  హాస్పిటల్‌కు వచ్చాడు. గాయానికి కుట్లు వేయటం కోసం డ్రెసింగ్ రూంలోకి పేషెంట్‌ను తీసుకువెళ్లాను. నేను గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో పేషెంట్‌ ఒక్కసారిగా నాపై దుర్భాషలాడు. రూంకి బయట ఉన్న.. పేషెంట్‌ కుమారుడు వెంటనే లోపలికి నా ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఇద్దరూ నన్ను దుర్భాషలాడారు’’ అని బాధిత రెసిడెంట్‌ డాక్టర్‌ తెలిపారు. పేషెంట్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్‌ తెలిపారు.  

ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు విజ్ఞప్తి  మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనుసరించి  విధుల్లో చేరారు. రెసిడెంట్‌ డాక్టర్లు.. ఆగస్టు 12న ప్రారంభించిన సమ్మె కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)