Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. సరిహద్దుల్లో అలర్ట్‌

Published on Mon, 01/26/2026 - 08:27

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తమైంది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో భద్రతా బలగాలు గస్తీ ముమ్మరం​ చేశాయి. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు భారీగా మోహరించాయి. డ్రోన్లతో ఎల్‌ఓసీ వెంట బలగాలు నిఘా పెట్టాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతం అంతటా భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురుగ్రామ్, చిల్లా, టిక్రీ, సింఘు, కాపషేరా, బదర్‌పూర్ మరియు ధౌలా కువాన్ సరిహద్దుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు.

 గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నట్లు తెలిపాయి.

గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్‌ నోటీసులు జారీ చేశారు.

 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)