సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట..

Published on Mon, 07/31/2023 - 13:32

సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. అవినీతి కేసులో డీకే శివకుమార్‌ సీబీఐ దర్యాప్తుపై గతంలో కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వగా.. హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.  సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నప్పటికీ విచారణపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర స్టే ఇచ్చిందని సుప్రీంకు ఆయన తెలిపారు.

డీకే శివకుమార్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై  సీబీఐ అప్పీల్ దాఖలు చేసిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన తదుపరి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేసేందుకు నిరాకరించిందని కోర్టుకు పేర్కొన్నారు. 

ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నందున తాము  జోక్యం చేసుకోబోమని పేర్కొంది.  అదే విధంగా తమ ముందున్న కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును కోరేందుకు  సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం సీబీఐ పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం 

కాగా డీకే శివకుమార్‌ అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10న స్టే ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో  ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని విచారణ సంస్థను ఆదేశించింది. శివకుమార్‌పై నమోదైన కేసులు 2020 నాటివని నొక్కి చెబుతూ.. గడిచిన రెండేళ్లుగా జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై తుది రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

ఇక 2017లో డీకే శివకుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఐటీ శాఖ అందించిన సమాచారం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా అతనిపై విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 25, 2019న అప్పటి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. అక్టోబర్‌ 8, 2020న రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై ఎఫైఆర్‌ నమోదైంది. అయితే దీనిని సవాలు చేస్తూ శివకుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు.
చదవండి: వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)