ప్రగతికి ’త్రి’ఫార్మ్స్‌: మోదీ

Published on Thu, 01/01/2026 - 05:56

న్యూఢిల్లీ: ‘దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలంటే సంస్కరణలు (రిఫార్మ్‌), పనితీరు (పర్‌ ఫార్మ్‌), రూపాంతరణ (ట్రాన్స్‌ ఫార్మ్‌) చాలా ముఖ్యం. అవే ప్రగతి మంత్రం‘ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రో యాక్టివ్‌ గవర్నెన్స్‌ అండ్‌ టైమ్లీ ఇంప్లిమెంటేషన్‌ (ప్రగతి) 50వ భేటీ బుధవారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన జరిగింది. గత పదేళ్లలో కనీసం రూ.85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని చెప్పారు.

 ప్రతి ప్రాజెక్టులోనూ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఐదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సందర్భంగా సమీక్షించారు. వీటిలో భాగంగా ఐదు రాష్ట్రాల పరిధిలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్, జల వనరులు, బొగ్గు వంటి రంగాల్లో పనులు చేపడుతున్నారు. పీఎం శ్రీ పథకం పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మోదీ సూచించారు. 

రాష్ట్రాల్లోని ఇతర స్కూళ్లన్నింటికీ పీఎం శ్రీ స్కూళ్లు ఆదర్శ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ‘సకాలంలో నిర్ణయాలు,, మెరుగైన సమన్వయం, జవాబుదారీతనం, వేగవంతమైన ప్రభుత్వ పనితీరు ఎంతటి సత్ఫలితాలను సాధిస్తా యో మా పాలనే ప్రజలకు చెబుతోంది. గుజరాత్‌ సీఎంగా ఉండగా స్వాగత్‌ పేరిట నేను అమలు చేసిన ప్రాజెక్టు తాలూకు అనుభవమే ప్రగతి వేదికకు మూలం‘ అని మోదీ గుర్తు చేసుకున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)