Breaking News

Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు

Published on Sat, 02/15/2025 - 07:05

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.

అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.

మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది.  ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి.  మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే  కొత్త అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.

ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)