Breaking News

హిమాచల్‌ కాంగ్రెస్‌లో రగులుతున్న అసమ్మతి

Published on Sun, 03/03/2024 - 05:53

సిమ్లా/చండీగఢ్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజిందర్‌ రాణా సారథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైన వీరిని కాంగ్రెస్‌ పార్టీ అనర్హులుగా ప్రకటించింది. అదే ఎమ్మెల్యే రాజిందర్‌ రాణా శనివారం మరో బాంబు పేల్చారు.

సీఎం సుఖ్‌వీందర్‌ సింగ్‌ సుక్కూ వైఖరితో విసుగుచెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతోపాటు మరో తొమ్మిది మంది తనతో టచ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో రాణా చెప్పారు. సీఎం సుక్కూను అబద్ధాల కోరుగా ఆయన అభివర్ణించారు. ఇలా ఉండగా, హిమాచ్‌ కేబినెట్‌ సమావేశంలో విధానపర అంశాలపై వాడీవేడి చర్చ అనంతరం మంత్రులు జగత్‌ నేగి, రోహిత్‌ ఠాకూర్‌ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)