Breaking News

Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?

Published on Wed, 07/02/2025 - 16:05

సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్‌ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది.  

విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.

జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)