Breaking News

ఇదేందిది.. ఈ వారసుడు కథ సినిమాను మించిపోయిందే!

Published on Tue, 12/12/2023 - 13:40

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో అందరినీ ఆశ్చర్యపరిచే ఉదంతం వెలుగు చూసింది. 28 ఏళ్ల క్రితం తప్పిపోయి, ఎక్కడో ఉన్న కుమారుడు అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అతని స్థానంలో 12 ఏళ్ల క్రితమే ఒక అపరిచితుడు వారి కుమారుడినంటూ వారి ఇంటికి వచ్చి ఉంటున్నాడు. 

ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కుమారుడు తాను కొన్నేళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నానని కుటుంబసభ్యులకు తెలిపాడు. తాను హరిద్వార్‌లో సన్యాసుల మధ్య ఉంటున్నానని, తన పేరును కళ్యాణ్ గిరి మహారాజ్‌గా మార్చుకున్నానని తెలిపాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి, తాను మీ ఇంటి మనిషినేనని చెప్పడంతో వారంతా తెగ ఆశ్చర్యపోయారు. 

వెంటనే కుటుంబ సభ్యులు ఇంతకాలం తమ ఇంటిలోని మనిషిలా ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను వారికి అసలు విషయాన్ని చెప్పాడు. సినిమా కథను తలపించే ఈ రియల్‌ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఖాండ్వా జిల్లాలోని ఖల్వా గిరిజన డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని కలాం ఖుర్ద్ గ్రామంలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. 28 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కథలో ట్విస్ట్ 12 ఏళ్ల క్రితం అంటే 2011లో చోటు చేసుకుంది. వారి ఇంటికి వచ్చిన ఒక సన్యాసి తాను 16 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ కుమారుడిని అని చెప్పుకున్నాడు. అప్పటి నుంచి అంటే గత 12 ఏళ్లుగా ఆ కుటుంబంతోపాటు ఉంటున్నాడు. అయితే ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అసలు కొడుకు ఇంటికి రావడంతో నకిలీ కొడుకు బండారం బయటపడింది. 

12  ఏళ్లుగా వారి ఇంట్లో ఉంటున్న వ్యక్తి.. ఇన్నాళ్లూ నాలుగు రోజులు ఇంట్లో ఉంటూ, కొన్ని రోజులు బయట సన్యాసి వేషంలో తిరుగుతూ వచ్చాడు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అయితే 28 ఏళ్ల తరువాత నిజమైన కుమారుడు తిరిగి రావడంతో.. అంతవరకూ కుమారునిగా నటించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఫోనులో అతనితో మాట్లాడగా.. ఇన్నాళ్లూ వారి ఇంటిలో ఏర్పడిన లోటును తీర్చేందుకే తాను వారితో కొడుకునని చెప్పానని, ఇప్పుడు వచ్చిన వ్యక్తే అసలైన కుమారుడు అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు!
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్‌ ఛానల్‌ వీక్షించండి: 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?