Breaking News

మధ్యప్రదేశ్‌లో అక్కడ మళ్లీ పోలింగ్‌!

Published on Tue, 11/21/2023 - 11:08

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్‌ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భింద్‌లోని కిషుపురాలో పోలింగ్‌ కేంద్రం నెంబర్‌ 71 బూత్‌లో కొందరు అధికారులు ఓటింగ్‌ నిబంధనలు ఉ‍ల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్‌ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు అధికారులు.

ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్‌ సంజీవ్‌ శ్రీ వాస్తవ్‌ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్‌లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్‌ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్‌ వర్కర్‌ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్‌ 17వ తేదిన చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్‌ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరగనుంది. 

(చదవండి:  కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి)

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు