Breaking News

ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 04/05/2024 - 16:19

ముంబై: ఎన్నికల బాండ్ల స్కీమ్‌ రద్దుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పందించేందుకు నిరాకరించారు.  ఆర్‌బీఐ ద్వై మాసిక క్రెడిట్‌ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు శుక్రవారం(ఏప్రిల్‌ 5)గవర్నర్‌ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్నికల బాండ్లపై గవర్నర్‌ను  ప్రశ్నించగా ‘నో కామెంట్‌’ అని సమాధానమిచ్చారు.

‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇటీవల ఎన్నికల  బాండ్ల వివరాలు వెల్లడించింది. కంపెనీలు తమ నికర విలువ కంటే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం అనే అంశం మా పరిధిలోకి రాదు’అని దాస్‌ చెప్పారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసిన  విషయం తెలిసిందే.

ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి అందించాలని ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్‌బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచి బహిర్గతం చేసింది.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. 

ఇదీ చదవండి.. బర్త్‌ సర్టిఫికెట్‌ కొత్త రూల్స్‌.. రూల్స్‌లో కీలక మార్పులు 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)