‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన అవసరం లేదు’

Published on Mon, 10/07/2024 - 13:00

ఢిల్లీ : తాను అస్వస్థతకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌ టాటా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. 

సోమవారం ఉదయం నుంచి రతన్‌ టాటా ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం.. రతన్‌ టాటా రక్తపోటు  తగ్గడంతో ఆదివారం అర్థరాత్రి 12:30 నుండి 1:00 గంటల మధ్య టాటాను ఆయన కుటుంబ సభ్యులు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు, ట్వీట్‌లు వెలుగులోకి వచ్చాయి. 

 

ఆస్పత్రికి వచ్చిన వెంటనే టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారని,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. 

ఈ తరుణంలో ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రతన్‌ టాటా ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీంతో టాటా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్‌ పడినట్లైంది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)