Breaking News

‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం

Published on Thu, 03/05/2026 - 09:52

త్రిశూర్: కళకు మతం అడ్డుకాదని, భక్తికి ఆచారాలు సరిహద్దులు కావని కేరళకు చెందిన ఒక ముస్లిం కళాకారుడు చాటిచెప్పారు. రంజాన్ పవిత్ర మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న రషీద్ కారళం, బుధవారం సాయంత్రం తన కథాకళి అరంగేట్రానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు గ్రీన్ రూమ్‌లో ఇఫ్తార్ విందు ముగించి వార్తల్లో నిలిచారు.

కథాకళిలో అత్యంత సంక్లిష్టమైన కుచేలుడి వేషధారణలో ఉంటూనే, అజాన్ పిలుపు వినిపించగానే ఆయన తన దీక్షను విరమించి, నేరుగా రంగస్థలంపైకి అడుగుపెట్టారు. త్రిశూర్ జిల్లా ఇరింజలకుడలోని టౌన్ హాల్ వేదికగా జరిగిన ఈ అపురూప ఘట్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాకుండా, భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. ప్రముఖ చిత్రకారుడు మోహన్‌దాస్‌ను సత్కరించేందుకు ‘యువకళా సాహితి’ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ‘కుచేలవృత్తం’ కథాకళి ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో రషీద్ కారళం కుచేలుడి పాత్రను పోషించారు. కథాకళికి అవసరమైన భారీ మేకప్, ఆహార్యంతో సిద్ధమైన రషీద్.. ప్రదర్శన సమయం దగ్గరపడుతున్న తరుణంలోనే ఉపవాసం విరమించాల్సి వచ్చింది. తన గురువు కళానిలయం వినోద్ పర్యవేక్షణలో గత కొన్నేళ్లుగా కఠిన శిక్షణ పొందుతున్న రషీద్‌కు.. ప్రేక్షకుల మధ్య ఈ అరంగేట్రం చేయడం ఒక జీవితకాల స్వప్నం. ఆ కల సాకారమయ్యే క్రమంలో అటు మతపరమైన నిష్ఠను, ఇటు కళాభిమానాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకున్నారు రషీద్.

సామాజిక కార్యకర్త అయిన రషీద్ .. ఇరింజలకుడ కథాకళి క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యువకళా సాహితి సంయుక్త కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కేవలం కళాకారుడిగానే కాకుండా 'వీటిలె లైబ్రరీ' (ఇంటి లైబ్రరీ) పేరుతో పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విశేష ప్రదర్శన సమయంలో రషీద్ కుటుంబ సభ్యులు భార్య రజియా, కుమారుడు షాహిల్, కుమార్తె డాక్టర్ షహానా , మనవరాలు కనల్ కతిర్ గ్రీన్ రూమ్‌లోనే ఉండి ఆయనకు సహకారం అందించారు.

ఇది కూడా చదవండి: బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)