Breaking News

మనకు ఎల్‌ ని‘నో’!

Published on Sun, 06/14/2026 - 04:59

సాక్షి స్పెషల్‌ డెస్క్ : పసిఫిక్‌ మహాసముద్రంలో తీవ్రమైన ‘సూపర్‌ ఎల్‌ నినో’పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనా లు బలహీనపడి, వర్షాలు తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ముప్పు తప్పే అవకాశం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఒక అరుదైన వాతావరణ పరిస్థితి మనల్ని కాపాడనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘పాజిటివ్‌ ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌’ (పాజిటివ్‌ ఐఓడీ) లేదా ‘ఇండియన్‌ నినో’అని పిలుస్తున్నారు. 

ఏమిటీ పాజిటివ్‌ ఐఓడీ?: హిందూ మహాసముద్రం తూర్పు, పశ్చిమ భాగాల మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పునే ‘ఐఓడీ’అంటారు. ఈ పరిస్థితులో పశ్చిమ భాగం (భారత్‌/ఆఫ్రికా వైపు) సముద్రపు నీరు సాధారణం కంటే బాగా వేడెక్కుతుంది. దీనివల్ల భారీగా తేమతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. తూర్పు భాగం (ఇండోనేసియా వైపు)లో నీరు సాధారణం కంటే చల్లబడుతుంది. పసిఫిక్‌లోని ఎల్‌ నినో మన దేశానికి వచ్చే రుతుపవన గాలులను వెనక్కి లాగేస్తుంటే.. హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్‌ నినో’ఆ గాలులను అంతే బలంగా మన దేశం వైపు నెడుతుంది. ఫలితంగా ఎల్‌ నినో తెచ్చే పొడి గాలులు తటస్థంగా మారి, దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

1997 నాటి వాతావరణ అద్భుతం!: ఇలాంటి పరిస్థితి 1997లోనూ చోటు చేసుకుంది. ఆ ఏడాది.. శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్‌ నినో రావడంతో భారత్‌లో తీవ్ర కరువు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ సరిగ్గా అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘పాజిటివ్‌ ఐఓడీ’... ఎల్‌ నినో ప్రభావాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ ఏడాది కరువు రాకపోగా.. దేశంలో సాధారణం కంటే 2 శాతం ఎక్కువే వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఎల్‌ నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో కరువు రావాలనేమీ లేదు. అయితే ఈ ఏడాది మనకు ‘ఇండియన్‌ నినో’రక్షణగా నిలవబోతున్నదన్న అంచనాలు, భారతీయ రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)