Breaking News

మువ్వన్నెల గౌరవం!

Published on Tue, 01/27/2026 - 05:26

జెండా పడిపోవచ్చు.. కానీ భారతీయుడి దేశభక్తి ఎప్పుడూ తలవంచుకోదు!.. అని ఓ ఆటో డ్రైవర్‌ నిరూపించాడు. గణతంత్ర దినోత్సవాల వేళ సోషల్‌ మీడియాను ఫిదా చేస్తున్న అద్భుత దృశ్యమిది. ఆకాశమంత దేశభక్తికి ఆస్కారం అక్కర్లేదు.. చిన్నపాటి గౌరవం చాలని చాటి చెప్పిన క్షణమది.

చిన్నారి కళ్లలో వెలుగు
అనన్య సింగ్‌ అనే యువతి తన రాపిడో ఆటోలో వెళ్తుండగా.. పక్కనే ఒక కారు కిటికీలోంచి ఓ చిన్నారి ఉత్సాహంగా జాతీయ జెండాను ఊపుతోంది. వేగంగా వెళ్తున్న ఆ కారు గాలికి అకస్మాత్తుగా ఆ పాప చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం జారి రోడ్డుపై పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాపిడో డ్రైవర్‌ తన ఆటోను ఆపాడు. కిందపడిన జెండాను అత్యంత భక్తితో చేతుల్లోకి తీసుకున్నాడు. దానిపై ఉన్న ధూళిని దులిపి, ఎంతో ప్రేమగా తిరిగి ఆ చిన్నారికి అందజేశాడు. తన జెండా దక్కగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, దాన్ని అందిస్తున్నప్పుడు ఆ డ్రైవర్‌ కళ్లలో కనిపించిన సంతృప్తి.. ‘వందేమాతరం’ ఆత్మను ప్రతిబింబించాయి.

అది అద్భుతం
‘నా రాపిడో డ్రైవర్‌ ఆ జెండాను తీసి, తుడిచి, అంత ప్రేమతో తిరిగి ఇచ్చిన తీరు అద్భుతం’.. అంటూ అనన్య సింగ్‌ వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ ఏడాది ‘వందేమాతరం – 150 ఏళ్లు’ థీమ్‌తో భారత్‌ గణతంత్ర వేడుకలను జరుపుకొంటోంది. కర్తవ్య పథ్‌లో సైనిక కవాతులు ఒకవైపు దేశ బలాన్ని చాటుతుంటే, రోడ్డు మీద సామాన్య ఆటో డ్రైవర్‌ చూపిన ఈ ‘జన భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) దేశపు సంస్కారాన్ని చాటిచెప్పింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)