Breaking News

అనుష్క పోస్ట్‌కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు

Published on Mon, 04/20/2026 - 13:24

రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్‌ చార్జీలు డిమాండ్‌ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్‌ నెట్టింట విపరీతంగా వైరల్‌ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.

ర్యాపిడో డ్రైవర్‌ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి షేర్‌  చేయడంతో పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్‌లను ఆమె స్క్రీన్‌ షాట్‌ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్‌ తనకు హాయ్‌ అంటూ వాట్సాప్‌ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. 

‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్‌ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్‌ చేశాడతను.

దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్‌ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతే ఆ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. 

ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)