Breaking News

నటి రన్యారావు కేసులో కీలక మలుపు

Published on Tue, 03/11/2025 - 14:02

సినీ నటి రన్యారావు కీలక నిందితురాలిగా ఉన్న బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.  ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్‌ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రత్యేక విచారణకు ఆదేశించారు.

ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. అలాగే తన విదేశీ పర్యటనల టైంలో వాళ్ల చేతుల్లో వేధింపులకు గురయ్యానన్న రన్యారావు ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరపనుంది. వీలైనంత త్వరగా నిజనిర్ధారణలతో నివేదిక సమర్పించాలని దర్యాప్తు ఏజెన్సీని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక మరోవైపు.. నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం అక్రమ రవాణా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్‌ దుర్వినియోగం అంశంపైనా ప్రభుత్వం విడిగా మరో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, అదనపు సీఎస్‌ గౌరవ్‌ గుప్తా అప్పగించింది. అలాగే.. ఈ అంశంలో ఆమె సవతి తండ్రి, డీజీపీ కె. రామచంద్రరావు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే ఆయన్ని విచారించాలని కోరింది. ఈ వ్యవహారంలో రామచంద్ర పాత్ర ఉందా? లేదా? అనేది తేల్చాలని గుప్తాకు వారం గడువు ఇచ్చింది ప్రభుత్వం. 

మార్చి 3వ తేదీన 14.8 కేజీల అక్రమ బంగారాన్ని దుబాయ్‌ నుంచి తీసుకొస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్సీ(DRI) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో లోతుకు వెళ్లే కొద్దీ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కన్నడ నటి రన్యా రావ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు