Breaking News

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్.. ఉపవాసం దీక్ష ఎప్పుడంటే?

Published on Mon, 02/02/2026 - 20:57

ముస్లింలందరూ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో, అదే రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్‌ మాసం ఫిబ్రవరిలో ప్రారంభం కానుండటం విశేషం. చివరగా 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్‌ మాసం మొదలైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో రంజాన్‌ మాసం ప్రారంభమవనుంది. 

ఇక, ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిలందరూ ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ రంజాన్ మాసం నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో, రంజాన్‌ మార్చి 20 లేదా 21 తేదీన వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం, ఉపవాసాన్ని విరమించడానికి, ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు.

ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, రంజాన్ నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. తొలి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎందుకని పవిత్ర మాసంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ఎందుకు పాటిస్తారు.

అయితే, రంజాన్ అనేది ఓ నెల పేరు. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్‌లో  తొమ్మిదో నెల.  ముస్లింలు ఆచరించేది చంద్రమాన క్యాలెండర్. ముస్లిం క్యాలెండర్  అనేది  ఎలా ఏర్పడిందంటే.. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వెళ్లడం జరిగింది. దీన్నే హిజ్రత్  అని కూడా  అంటారు. క్రీస్తు శకం లేదా సామాన్య శకం 622లో ఇది జరిగినట్లు చెబుతారు. దీన్నే హిజ్రీ శకం అని అంటారు.

మొదటి నెల మొహరం
క్రీస్తు శకం లేదా సామాన్య శకం 638లో ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్యాలెండర్ ప్రకారం  మొదటి నెల మొహరం, రెండో నెల సఫర్,  మూడో నెల రబీ ఉల్ - అవ్వల్, నాలుగో నెల రబీ ఉల్ -ఆఖిర్, ఐదో నెల జమాది ఉల్ - అవ్వల్, ఆరో నెల  జమాది ఉస్- సాని, ఏడో నెల రజబ్,  ఎనిమిదో నెల షాబాన్,  తొమ్మిదో నెల  రంజాన్, పదో నెల షవ్వాల్,  పదకొండో నెల  జుల్ -  ఖాదా,  పన్నెండో నెల జుల్ -  హిజ్జా. అయితే తొమ్మిదో నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు.  అందుకే ఈ రంజాన్ నెలను పవిత్ర మాసంగా, పవిత్ర పండుగగా ప్రతీ ముస్లింలు ఆచరిస్తారు. ఈ పండుగనే ఈద్-ఉల్-ఫిత్ర అని కూడా పిలుస్తారు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)