Breaking News

రామమందిర వార్షికోత్సవాలు 31నుంచి 

Published on Sat, 12/13/2025 - 06:05

అయోధ్య: ఏళ్ల కిందటి హిందువుల కలను నెరవేరుస్తూ నిర్మితమైన రామమందిరం రెండో వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 31నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ శుక్రవారం తెలిపింది. ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి‘గా జరుపుకొంటామని వెల్లడించింది. ఆలయ సముదాయంలోని ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.  

ఈ వేడుకకు సంబంధించిన ముసాయిదాను నేడు జరగనున్న సమావేశంలో ఖరారు చేస్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ డిసెంబర్‌ 31న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. ఏడు ఉప ఆలయాల శిఖరాలపై ఇద్దరు నాయకులు సంయుక్తంగా జెండాలను ఎగురవేస్తారన్నారు. 

నవంబర్‌ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ పర్యటన సందర్భంగా, ఆలయ ప్రధాన శిఖరంపై జెండాను ఎగురవేసినప్పుడు, ఈ ఏడు ఆలయాల శిఖరాలపై జెండాలను ఎగురవేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, ఆలయాల పనులు పెండింగ్‌లో ఉండటం, అనివార్య కారణాల వల్ల ఈ ప్రణాళిక వాయిదా పడిందని ట్రస్టŠట్‌ వర్గాలు తెలిపాయి.  అలంకరణతో సహా ఏడు దేవాలయాల పనులు ఇప్పుడు పూర్తయ్యాయని, ‘ప్రతిష్ఠ ద్వాదశి’ వేడుకల సందర్భంగా జెండాలను ఎగురవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించాయి. ఈ వేడుకకు సంబంధించిన ఆచారాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)