Breaking News

అయోధ్య విరాళాల చోరీ .. కుంభమేళా టార్గెట్‌

Published on Wed, 07/01/2026 - 18:11

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఆలయానికి వచ్చే కానుకల చోరీలో అత్యధిక భాగం విరాళాల చోరి 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారించగా ఈ అంశాలే వెల్లడైనట్లు పేర్కొన్నారు.

కుంభమేళానే టార్టెట్?
2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని జరిగింది. దీనికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తుల పోటెత్తారు. ఆ భక్తులు అయోధ్యలోని రామమందిరానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఈ సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో ఆలయ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల చోరీకి పాల్పడ్డారు. ఈ కుట్రను నిందితులంతా కలిసే పన్నారని పోలీసులు  పేర్కొన్నారు.

దోపిడిలో వారిదే సింహభాగం
ఈ విరాళాల చోరీలో లవ్‌కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదులు అత్యధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. వీరు ఈ దొంగతనాల ద్వారా సంపాదించిన సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకు పైగా స్థిరాస్తులను పోలీసులు గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలను లోతుగా పరిశీలించేందుకు అయోధ్య పోలీసులు ఆదాయపు పన్ను శాఖ సహాయం తీసుకుంటున్నారు. అలాగే, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరిపించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి కూడా లేఖ రాయనున్నారు.

ఎస్బీఐ (SBI) సిబ్బంది పాత్రపై అనుమానాలు
ఆలయంలోని విరాళాల లెక్కింపు ప్రక్రియను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం బ్యాంక్ ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. ఆలయంలోని నాలుగు విరాళాల పెట్టెల్లో వచ్చే నగదును లెక్కిస్తారు. ఈ లెక్కింపు బృందంలో 11 మంది బ్యాంక్ సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్ట్ సభ్యులతో కలిపి మొత్తం 14 మంది ఉంటారు. అయితే, ఈ చోరీలో కొందరు ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లాకు చెందిన 'కౌశల్ పూరి' స్థావరం నుండి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం అవినాష్ శుక్లా సోదరుడైన అభిషేక్ నడుపుతున్న ఒక యోగా కేంద్రం. జూన్ 5న పోలీసులు ఈ యోగా కేంద్రంపై దాడి చేసి భారీగా నగదును రికవరీ చేసినట్లు అక్కడి నిర్వాహకురాలు సీమా తివారీ తెలిపారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)