Breaking News

రామ్‌ విలాస్‌ వేదాంతి కన్నుమూత

Published on Tue, 12/16/2025 - 06:14

అయోధ్య: రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి(67)సోమవారం గుండెపోటుకు గురై కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని రేవాలోని ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం విషపూరితం కావడంతో కిడ్నీలు ఫెయిలయ్యాయని, ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. 

వెంటిలేటర్‌ అమర్చిన కొద్ది గంటల్లోనే సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్నారు. వేదాంతి అంత్యక్రియలను అయోధ్యలో నిర్వహిస్తామని ఆయన శిష్యుడు చోటె దాస్‌ మహారాజ్‌ చెప్పారు. ఈ నెల 10వ తేదీన రేవాలో జరిగే ఆధాత్మిక కార్యక్రమం కోసం వేదాంతి అయోధ్య నుంచి వెళ్లారని, అక్కడే అనారోగ్యానికి గురయ్యారని అయోధ్య మేయర్‌ గిరీశ్‌పతి త్రిపాఠీ చెప్పారు. 

1958లో రేవాలో జన్మించిన వేదాంతి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఈయన అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గఢి మహంత్‌ అభిరామ్‌ దాస్‌ శిష్యుడు. 1949లో బాబ్రీ మసీదులో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించింది అభిరామ్‌ దాసేనని ఆయన శిష్యులు చెప్పారు. వేదాంతి అయోధ్యలో వశిష్ట భవన్‌ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)