Breaking News

ఎన్నికలప్పుడే విపక్షాలపై  ఈడీ దాడులా?

Published on Sun, 01/11/2026 - 05:43

న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించిన సమయంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విపక్ష నేతలపై దాడులు చేయడం వెనక మతలబు ఏమి టని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. అసలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పరిధిని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లన్నింటినీ తక్షణం విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

 పశ్చిమబెంగాల్‌లో ఈడీ తాజా దాడుల ఉద్దేశం కేవలం విపక్ష నేతలను వేధించమేనని స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఒక సంస్థ కార్యాలయంలోకి చొరబడి కనిపించిన డాక్యుమెంట్లనల్లా జప్తు చేసేస్తామనడం సమంజసమా అని ప్రశ్నించారు. 

కేవలం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించలేమనే కడుపు మంటతో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎలాగైనా ఇబ్బందులపాలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలా ఈడీని ఉసిగొల్పిందని సిబల్‌ ఆరోపించారు. గతంలో బిహార్‌లో లాలుప్రసాద్, తేజస్వీ యాదవ్, జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌పైనా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఈడీ దాడులకు దిగిందని గుర్తు చేశారు. బెంగాల్‌లో ఐప్యాక్‌ సంస్థపై దాడుల తర్వాత ఈడీ ఇప్పుడు ఇంకే విచారిస్తోందని ప్రశ్నించారు.

..అస్సలు అనుకోలేదు!
యూపీఏ హయాంలో 2004–14 మధ్య ఇలా విపక్షాలు, విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ఎప్పుడూ జరగలేదని సిబల్‌ అన్నారు. ‘‘ఇప్పుడు మాత్రం ఈడీ సర్వాంతర్యామిగా మారిపోయింది. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడికైనా ఇట్టే వెళ్లి వాలిపోతోంది. విచారణ పేరుతో అడ్డ గోలు దాడులకు దిగుతోంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే పనులతో సమాఖ్య వ్యవస్థనే కదలబారుస్తోంది’’అంటూ దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో ఈడీని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి పరిణామాన్ని మేం ఊహించలేదు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)