Breaking News

తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్‌’ గిఫ్ట్‌

Published on Fri, 06/06/2025 - 17:49

మలిహాబాద్: ‘రాజ్‌నాథ్ మామిడి’... రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరుతో  కొత్త మామిడి రకం  ఉత్పత్తి అయ్యింది. ఉద్యానవనాలు, పండ్ల తోటల పెంపకంలో ప్రత్యేక కృషి చేసి, అందుకు ప్రతిగా ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కలిముల్లా ఖాన్ ఇప్పుడు మరో మామిడి రకాన్ని ఉత్పత్తి చేశారు. దానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మామిడి అని పేరు పెట్టారు

‘మ్యాంగో మ్యాన్‌’గా పేరొందిన కలిముల్లా ఖాన్, తాజాగా తన తన మలిహాబాద్(ఉత్తరప్రదేశ్‌) తోటలో సిగ్నేచర్ గ్రాఫ్టింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి, పండించిన కొత్త  రకపు మామిడికి ‘రాజ్‌నాథ్ ఆమ్’ అని పేరు పెట్టారు. గతంలో ఈయన తాను ఉత్పత్తి చేసిన మామిడి రకాలను సచిన్ టెండుల్కర్, ఐశ్వర్య రాయ్, అఖిలేష్ యాదవ్, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, అమిత్ షా తదితర ప్రముఖ భారతీయుల పేర్లు పెట్టారు.  ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘దేశానికి అర్థవంతమైన సేవ చేసినవారి పేర్లను తాను తన మామిడి రకాలుకు పెట్టుకుంటానని, ఈ రకాలు తరతరాలుగా నిలిచి ఉండాలని కోరుకుంటానని అన్నారు.

ప్రజలు కొంతకాలానికి ప్రముఖులను మరిచిపోతుంటారు. అయితే తాను ఉత్పత్తి చేసిన ఈ మామిడి రకాలు ప్రముఖులను గుర్తుచేస్తాయని ఖాన్‌ అన్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన పోరులో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ యుద్ధం కాకుండా, శాంతిని కోరుకున్నారని కలిముల్లా ఖాన్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ దురాక్రమణకు నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన లక్నోలోని మలిహాబాద్  గురించి ఆయన మాట్లాడుతూ 1919లో ఈ ప్రాంతంలో 1,300 మామిడి రకాలు ఉండేవని, అయితే కాలక్రమేణా అవి మార్కెట్ నుండి అదృశ్యమయ్యాయన్నారు. అయితే తాను మామిడి రకాలను పునరుద్ధరించడానికి కృషి చేశానని ఇప్పుటి వరకూ  300కుపైగా మామిడి రకాలను అభివృద్ధి చేశానని అన్నారు. తన జీవిత లక్ష్యం గురించి ఖాన్‌ మాట్లాడుతూ తాను ఈ భూమి మీద నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా జనం తాను రూపొందించిన మామిడి రకాలను రుచి చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. 

ఇది కూడా చదవండి: కురచ దుస్తులతో వస్తే సెల్ఫీలివ్వను: బీజేపీ మంత్రి

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)