Breaking News

రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్‌ కుమార్‌ సింగ్‌

Published on Sat, 11/02/2024 - 06:21

సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ ఢిల్లీ సౌత్‌ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన ఆర్‌కే సింగ్‌ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్‌కే సింగ్‌ నేషనల్‌ వార్‌ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. 

‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్‌ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్‌కే సింగ్‌ చేపట్టారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు