Breaking News

పాక్‌లో 90 రోజులున్నా.. ఐఎస్‌ఐ అధికారుల్ని కలిశా!

Published on Fri, 05/30/2025 - 07:29

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ నిఘా సిబ్బందికి (పీఐవోలకు) భారత మొబైల్‌ సిమ్‌ కార్డులను అందజేయడంతోపాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. రాజస్తాన్‌ రాష్ట్రం దీగ్‌ జిల్లా గంగోరా గ్రామానికి చెందిన కాసిమ్‌(34)ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇతడు 2024 ఆగస్ట్‌– 2025 మార్చి మధ్యలో రెండుసార్లు పాకిస్తాన్‌ వెళ్లి వచ్చాడని, అక్కడ కనీసం 90 రోజులు గడిపినట్లు విచారణలో వెల్లడించాడని చెప్పారు. ఆ సమయంలో అతడు పాక్‌ గూఢచర్య విభాగం ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)అధికారులను కలిసినట్లు చెబుతున్నారు. 

భారత మొబైల్‌ నంబర్లను పాక్‌ నిఘా విభాగం అధికారులు గూఢచర్యం కోసం వాడుతున్నట్లు 2024 సెప్టెంబర్‌లో తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని ఇక్కడే పొంది, అక్కడికి పంపించారని తెలిపారు. ఈ నంబర్లను వాడుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ మార్గాల్లో భారతీయులను వలలో వేసుకుని, ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. వీటిపై దర్యాప్తు సమయంలోనే కాసిమ్‌ పేరు బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అధికారులు దేశంలో గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై పలువురిని అదుపులోకి తీసుకుంటుండటం తెల్సిందే. 

ఇది కూడా చదవండి: ‘ఇంకా ఎక్కువే చేయగలం’: పాక్‌కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు