Breaking News

భార్యపై యాసిడ్‌ దాడి.. భర్తకు మరణ శిక్ష

Published on Mon, 09/01/2025 - 09:22

ఉదయపూర్: భార్యను పలు రకాలుగా వేధిస్తూ, ఆమెపై  కర్కశంగా యాసిడ్‌ దాడి చేసిన భర్తకు కోర్టు మరణశిక్ష విధించింది. భార్య శరీరపు రంగును తూలనాడుతూ, ఆమె స్థూలకాయాన్ని హేళన చేస్తూ, హీనంగా ప్రవర్తించిన భర్త కోర్టు తీర్పు మేరకు ఉరికంబం ఎక్కనున్నాడు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి అనే  మహిళను రంగు తక్కువ ఉన్నావంటూ, ఆమె భర్త కిషన్ తరచు ఎగతాళి చేసేవాడు. ఒక రోజు రాత్రి కిషన్‌ ఏదో ద్రావకం(యాసిడ్‌)  తెచ్చి.. భార్యతో శరీరమంతా పూసుకోవాలని చెప్పాడు. ఆమె దానిని రాసుకుంది. అయితే ఏదో దుర్వాసన వస్తున్నదని భర్తకు చెప్పింది. తరువాత భర్త ఆమె కడుపుపై ​​అగరుబత్తిని వెలిగించాడు. దీంతో ఆమె శరీరం అంతటా మంటలు వ్యాపించాయి. తరువాత మరికొంత  యాసిడ్‌ను ఆమె శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి బూడిదయ్యింది.

ఈ ఘటనకు సంబంధించి ఉదయ్‌పూర్‌లోని వల్లభ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. నిందితుడు కిషన్‌ను అరెస్టు చేసిన పోలీసులు అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ పలివాల్ మాట్లాడుతూ ‘నిందితుడు తన భార్య నల్లగా ఉన్న కారణంగా, ఆమెను వేధించేవాడని, ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించాడని అన్నారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించిందన్నారు. ఈ ఘటనలో నిందితునికి కోర్టు న్యాయమూర్తి మరణశిక్ష విధించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)