Breaking News

రీల్‌ కోసం పాకులాట

Published on Tue, 07/08/2025 - 05:32

జైపూర్‌: రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్‌ సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిండుగా తొణికిసలాడుతున్న భరత్‌పూర్‌ జిల్లాలోని బంధ్‌ బరైతా రిజర్వాయర్‌పై ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై భయపడుతున్న తన కూతురిని బలవంతంగా అతడు కూర్చోబెడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 

ఈ నెల 4న ఉమా శంకర్‌ తన భార్య, కుమార్తెతో జలాశయం వద్దకు వెళ్లాడు. వీడియో చిత్రీకరించేందుకు గాను ప్రమాదకరంగా ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై తీవ్రంగా భయపడుతున్న తన కుమార్తెను గద్దించి కూర్చోబెట్టాడు. అక్కడ ఆమె కిందపడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటూ లేకపోవడం గమనార్హం. ఆ రిజర్వాయర్‌ ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. 

ఇటీవల వర్షాలకు జలకళ సంతరించుకుంది. ఇలాంటి పరిస్థితులు ఉమా శంకర్‌ తీసి, సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో లైకులు, షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యత లేకుండా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారా అని నిలదీశారు. దీంతో, ఉమా శంకర్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి ఆ వీడియోను డిలీట్‌ చేశాడు. పోలీసులు దీనిపై ఇంకా  స్పందించలేదు.  

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)