Breaking News

Rajasthan: పాక్‌కు రహస్యాల చేరవేత.. యువకుడి అరెస్ట్‌

Published on Sat, 10/11/2025 - 11:07

న్యూఢిల్లీ: పాకిస్తాన్  ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అల్వార్‌లోని గోవింద్‌గఢ్ నివాసి మంగత్ సింగ్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం మంగత్ సింగ్‌ను అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు.

సీఐడీ అధికారులు అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సారించినప్పుడు మంగత్ సింగ్ కార్యకలాపాలను గుర్తించారు. సింగ్ కొంతకాలంగా అనుమానాస్పద చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు గమనించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్ పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఇషా శర్మ అనే మారుపేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్ సింగ్‌ను హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూఢచర్య కార్యకలాపాలలో సహకరించినందుకు ప్రతిగా ఆ  హ్యాండ్లర్.. సింగ్‌కు ఆర్థికసాయం అందించినట్లు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో సింగ్‌ భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.

సింగ్ గత రెండేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, గూఢచర్య కార్యకలాపాలలో అతని ప్రమేయం  ఉందని పోలీసులు గుర్తించారు. మంగత్ సింగ్ అరెస్టు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాంతంలో నిఘా సారించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో  అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గూఢచర్యాన్ని అరికట్టేందుకు, భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.

గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నవారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అక్టోబర్ 10న జైసల్మేర్‌లో అనుమానిత గూఢచారి మహేంద్ర ప్రసాద్‌(32)ను అరెస్టు చేశారు. అతను డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా పనిచేస్తూ, సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్‌కు లీక్ చేశాడని తేలింది. 32 ఏళ్ల ప్రసాద్ పాకిస్తాన్ నిఘా నిర్వాహకునితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిధంగా జైసల్మేర్‌కు చెందిన హనీఫ్ ఖాన్‌ను  ఐఎస్‌ఐ కార్యకర్తలకు రహస్య సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)