Breaking News

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు

Published on Sun, 03/10/2024 - 20:41

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు (ఆదివారం) బీజేపీలో చేరారు.

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు రిచ్‌పాల్‌ మిర్ధా, విజయపాల్‌ మిర్ధా, ఖిలాడీ బైర్వా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్‌ బెనివాల్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ సేవాదళ్‌ సురేష్‌ చౌదరి, రాంపాల్‌ శర్మ, రిజుజున్‌వాలా తదితర నేతలు కూడా రాష్ట్రంలో అధికార పార్టీలో చేరారు. వీరందరికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా మంత్రులుగా ఉన్నారు. రిచ్‌పాల్ మిర్ధా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపీ జ్యోతి మిర్ధా మామ.

ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులు వెల్లడించారు. దేశం కోసం మోదీ కస్టపడి పని చేస్తున్న తీరు వారికి బాగా నచ్చిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ ప్రధాని నాయకత్వంలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)