Breaking News

ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన

Published on Sat, 12/28/2024 - 13:13

దేశంలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం దొరకడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అలా ఉద్యోగాలు దొరకనివారిలో చాలామంది ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్‌ అవుతున్నారు. అలాంటివారిని చూసి, ఇతరులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు యూపీకి  చెందిన ఎంఏ చాయ్‌వాలా. వివరాల్లోకి వెళితే..

చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి..
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు టీ వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏటా లక్షల్లో టర్నోవర్‌ చేస్తున్నాడు. అతని పేరు రాజ్ జైస్వాల్. అతను మీడియాతో మాట్లాడి తన వ్యాపారానికి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. అవి అతని మాటల్లోనే.. ‘నేను ఎంఏ చదివేందుకు అడ్మిషన్‌ తీసుకున్నాను. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే చదువు మానేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే గోండాలోని ఎల్‌బీఎస్ చౌరస్తాలో ఒక టీ దుకాణాన్ని ప్రారంభించాను. దానికి ఎంఏ చాయ్‌వాలా అని పేరు పెట్టాను’ అని తెలిపారు.

తల్లి ఇచ్చిన డబ్బుతో..
రాజ్ జైస్వాల్ బీఏ పూర్తి చేశాక ఎంఏ చదువుకుందామనుకున్నాడు. ఆర్థిక పరిస్థుతుల కారణంగా అతని కల నెరవేరలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, అవేవీ అతనికి సంతృప్తి నివ్వలేదు. దీంతో టీ దుకాణం తెరవాలని అనుకుని ఎంఏ చాయ్‌ వాలా పేరుతో దుకాణం ప్రారంభించాడు. అయితే ఈ పని అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. తల్లి మాత్రం రాజ్ జైస్వాల్‌కు అండగా నిలిచింది. ఆమె తన తగ్గరున్న డబ్బు ఇచ్చి, టీ దుకాణం తెరవాలని ప్రోత్సహించింది.

రోజుకు 300 టీల విక్రయం
అందరూ ఇంట్లో తయారుచేసుకునే టీలకు భిన్నంగా తాము కొన్ని మసాలాలను టీ తయారీకి ఉపయోగిస్తామని, దీంతో తమ దగ్గర టీ  మరింత రుచిగా ఉంటుందని రాజ్ జైస్వాల్ తెలిపాడు. కాగా ఇక్కడి టీ రుచి చాలా బాగుంటుందని, అందుకే ఇక్కడికి రోజూ వచ్చి టీ తాగుతామని పలువురు వినియోగదారులు మీడియాకు తెలిపారు. ఇక్కడ రూ.10 నుంచి రూ.40 ధరతో అనేక రకాల టీలు లభ్యమవుతాయి. ప్రతిరోజూ రాజ్‌ 250 నుంచి 300 కప్పుల టీ విక్రయిస్తుంటాడు. ఈ లెక్కన రాజ్‌ ప్రతీనెలా టీ విక్రయాలతో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని అర్థం చేసుకోవవచ్చు. 

ఇది కూడా చదవండి: 14 ఏళ్ల పాటు వైద్యం అందించిన డాక్టర్‌కు రూ. 10 లక్షల జరిమానా

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)