Breaking News

జార్ఖండ్‌లో కుర్మీల రైల్‌ రోకో

Published on Sun, 09/21/2025 - 05:31

రాంచీ: జార్ఖండ్‌లో శనివారం కుర్మీలు ఇచ్చిన రైల్‌ రోకో పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్ల రాకపోకలపై పడింది. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్‌ రైల్వే ధన్‌బాద్‌ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మీల ఆందోళన కొనసాగుతోంది. నిషేధం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు పట్టాలపై బైటాయించారు. తమ కుర్మలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, కుర్మీలకు షెడ్యూల్‌ తెగల హోదా ఇవ్వాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. 

రాత్రి వేళ కూడా ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చేదాకా విరమించేది లేదని ఆదివాసీ కుర్మీ సమాజ్‌ నేత ఓపీ మహతో స్పష్టం చేశారు. కు ర్మీలను 1931లో ఎస్టీల జాబితా నుంచి తొలగించారని, అప్పటి నుంచి పోరాడుతున్నా డిమాండ్‌ నెరవేరలేదని సంఘం మరో నేత షీతల్‌ ఓహదార్‌ చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామంటూ సమర్థించుకున్నారు. వీరికి పలు రాజకీయ పా ర్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.

 ఆందోళనల కారణంగా తూర్పు సెంట్రల్‌ రైల్వే ధన్‌బాద్‌ డివిజన్‌ పరిధిలో 25 ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని, మరో 24 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్‌ పరిధిలో వందేభారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సహా 12 రైళ్లను రద్దు చేసి, 11 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించామన్నారు. 

ఆందోళనల కారణంగా రైళ్లు నిలిచిపోవడంతో వేలాదిగా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుబడిపోయారు. టాటా–పట్నా వందేభారత్‌ రైలులోని వందలాది మంది ప్రయాణికులు రాంచీలోని మురి స్టేషన్‌లో ఉండిపోయారు. ఈ రైలును అధికారులు రద్దు చేసిన విషయం తెలిసి ప్రయాణికులు గగ్గోలు మొదలుపెట్టారు. కాగా, కుర్మీల నిరసన చట్ట విరుద్ధం, అప్రజాస్వామికమంటూ వివిధ గిరిజన సంఘాలు రాంచీలోని రాజ్‌భవన్‌ ఎదుట నిరసన తెలిపాయి. అసలైన గిరిజనుల హక్కులను లాక్కునేందుకు కుర్మీలు ప్రయతి్నస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.  
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)