Breaking News

పశ్చిమ బెంగాల్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Published on Tue, 09/24/2024 - 12:58

న్యూ మేనాగురి: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అలీపుర్‌దువార్ డివిజన్‌లోని న్యూ మేనాగురి స్టేషన్‌లో ఒక గూడ్స్ రైలులోని ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన దరిమిలా ఈ మార్గంలో వెళ్లే రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఇది ఐదు లైన్లతో కూడిన స్టేషన్ అని, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గూడ్సు రైలు పట్టాలు తప్పిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు(మంగళవారం) ఉదయం 6:20 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అలీపుర్‌దూర్‌ డివిజన్‌ ​​డీఆర్‌ఎం అమర్జీత్‌ గౌతమ్‌ తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. కాగా గత నెలలో కూడా పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాడు ఈ ఘటన మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌లోని కుమేదర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్‌జీపీ నుంచి కతిహార్ వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.


 

ఇది కూడా చదవండి: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
 

 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు