Breaking News

భారత్‌ చివరి కొనను సందర్శించా.. రాహుల్ గాంధీ

Published on Fri, 06/05/2026 - 15:38

శ్రీ విజయపురం: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించారు. అక్కడి ప్రకృతి సోయగాలు తనను కట్టిపడేశాయని ఎక్స్ ఖాతా వేదికగా రాసుకొచ్చారు. అండమాన్‌ నికోబార్ దీవులు కేవలం రక్షణపరంగా భారత్‌కు ఎంతో ముఖ్యమైనవని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోందని కానీ వాస్తవానికి అది సరికాదన్నారు.  అండమాన్‌ నికోబార్‌ చిత్రాలతో కలిగిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో అండమాన్‌ నికోబార్‌ దీవులపై పోస్ట్ చేస్తూ " నేను భారతదేశపు దక్షిణపు చివరి కొనను సందర్శించాను. ఇందిరా పాయింట్ వద్ద నిలబడ్డాను. శతాబ్దాలుగా నిలబడి ఉన్న చెట్ల కింద నడిచాను. భూమిపైనే అత్యంత జీవకళతో నిండిన పగడపు దిబ్బలలోకి మునిగాను.అక్కడ నివసించే ప్రజలతో కూర్చున్నాను. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి భూమిని లాక్కుంటున్న గిరిజన వర్గాలు. భారత ప్రభుత్వం ఈ ద్వీపాలలో స్థిరపరిచిన వలసదారులు, వీరిలో చాలామంది మాజీ సైనికులు, వీరికి సరైన పరిహారం అందడం లేదు." అని అన్నారు

బీజేపీ ప్రభుత్వం ప్రజలందరికీ  గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్.. కేవలం రక్షణ రంగానికి సంబంధించి మాత్రమే అని చెబుతాయి. కాని అది సరికాదు. ఈ పగడపు దీవులలో 1.5 కోట్ల చెట్లను నరికివేయడం. అధికారిక పటాల నుండి పగడపు దిబ్బలను తొలగించడం. సైనికులు, గిరిజనులను స్థానభ్రంశం చేయడం సరైంది కాదు.  కేవలం ఒక వ్యాపారవేత్త భారతదేశపు అత్యంత అమూల్యమైన పర్యావరణ భూమిపై హోటళ్లు , క్యాసినోలను నిర్మిస్తున్నారు. అని రాహుల్ విమర్శించారు.

తిరిగి పొందలేని దాన్ని నాశనం చేయడం ఎంతటి లాభానికైనా తగదనే విషయం మీకు తెలుసు అని రాహుల్ అన్నారు. తాను పర్యావరణ సమతుల్య అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఈ ద్వీపాలు ప్రపంచం ఇంతవరకు చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానంగా మారగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాంటి భారతదేశం కోసమే మనం పోరాడాలని  పోరాడాలి.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)